ఐపీఎల్ 14వ సీజన్ లోని రెండో ఫేజ్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా.. కాసేపటి క్రితమే చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టుకు సారధిగా ఉన్నారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌కి కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత 140 రోజులకు తిరిగి, లీగ్ ప్రారంభమైంది.
చెన్నై సూపర్ కింగ్స్: డుప్లెసిస్, గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, ధోని, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, బ్రేవో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహార్, హజెల్ వుడ్
ముంబై ఇండియన్స్: డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అన్మోల్ ప్రీత్, పోలార్డ్, సౌరబ్ తివారీ, క్రునల్ పాండ్య, మిల్నే, రాహుల్ చహార్, బుమ్రా, బౌల్ట్..