ENG vs PAK: భారత్‌కే ఐసీసీ సపోర్ట్, ఇది చాలా అన్యాయం.. ఇంజమామ్ సంచలన ఆరోపణలు!

  • ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం
  • భారత్‌కే ఐసీసీ సపోర్ట్
  • ఇంజమామ్ సంచలన ఆరోపణలు
Inzamam Ul Haq

Inzamam Ul Haq

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. ఈ ఓటమి అనంతరం పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పల్లెకెలె పిచ్‌ను ఉద్దేశపూర్వకంగా స్లోగా తయారు చేశారని, ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలంగా ఉండేలా రూపొందించారని ఆరోపించారు. ముఖ్యంగా పాక్ జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్న కారణంగానే స్లో పిచ్‌ను సిద్ధం చేశారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై ఇంజమామ్ ఆగహం వ్యక్తం చేశారు.

Also Read: Athadu Re-Release: ట్రెండింగ్‌లో ‘అతడు’ మూవీ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, 24 గంటల్లోనే..!

ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ… ‘పల్లెకెలె పిచ్‌ను ఉద్దేశపూర్వకంగానే స్లోగా సిద్ధం చేశారు. ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలంగా పిచ్ ఉంది. దీనికి వెనుక ఐసీసీ పాత్ర ఉందని నేను భావిస్తున్నా. గతంలో భారత్ జట్టు దుబాయ్‌లో ఆడినప్పుడు వారికి అనుకూలమైన పిచ్ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకూ అనుకూలంగా ఉండాల్సింది. ఐసీసీ ఎప్పుడూ బీసీసీఐకి మద్దతు ఇచ్చేలా వ్యవహరించకూడదు. ఇది అన్యాయం. పాకిస్తాన్ ఓటమికి కారణం పిచ్ పరిస్థితులే. ఐసీసీ అన్ని జట్లను ఒకేలా చూడాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ఓటమిపై ఇంజమామ్ చేసిన ఈ ఆరోపణలు అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త వివాదానికి దారితీసాయి.