Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన స్టార్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌ను అడ్డుకునేందుకు శ్రీలంక ‘ఎ’ జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగింది.
దంబుల్లాలో జరిగిన ఇండియా ‘ఎ’ – శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం ఆతిథ్య జట్టు మొదటి నుంచే స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేసింది. వైభవ్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచి ఫీల్డింగ్ మార్చడం, బౌలర్ల ప్లాన్లు అన్నీ అతడిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించాయి. ఐపీఎల్లో భారీ హిట్టర్‌గా గుర్తింపు పొందిన ఈ యువ ఆటగాడికి స్వేచ్ఛగా షాట్లు ఆడే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. అయితే, వైభవ్ కూడా తన దూకుడు తగ్గించలేదు. ఫాస్ట్ బౌలర్ చమిక గుణశేఖర వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో చెలరేగిపోయాడు. దీంతో శ్రీలంక జట్టు ముందుగానే సిద్ధం చేసుకున్న వ్యూహాన్ని అమలు చేసింది. నాలుగో ఓవర్లో స్పిన్నర్ సహన్ అరచ్చిగే బౌలింగ్‌కు వచ్చి వైభవ్‌ను ఉచ్చులోకి లాగాడు.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ఆ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన వైభవ్, తర్వాత సింగిల్ తీశాడు. అనంతరం తిరిగి స్ట్రైక్‌లోకి వచ్చిన అతడిని పెద్ద షాట్ ఆడేలా ప్రేరేపించిన అరచ్చిగే, బంతిని బయటకు టర్న్ అయ్యేలా వేశాడు. డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్ బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోయాడు. ఫలితంగా పాయింట్ ప్రాంతంలో ఉన్న వనుజ సహన్ సులభమైన క్యాచ్ అందుకుని అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇది కేవలం వికెట్ మాత్రమే కాకుండా, శ్రీలంక జట్టు ముందుగానే రూపొందించిన వ్యూహం విజయవంతమైన సందర్భంగా నిలిచింది.
కొన్ని నెలల క్రితం వరకు ఎదుగుతున్న ఆటగాడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ 2026లో తన అసాధారణ ప్రదర్శనతో సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు, 72 సిక్సర్లు బాదుతూ క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లన్నీ అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించాయి. అయితే ఇండియా ‘ఎ’ తరఫున ఆడుతున్న సమయంలో వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్ స్థాయి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. శ్రీలంక ‘ఎ’తో తొలి మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన అతడు, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’పై 44 పరుగులు చేసినప్పటికీ పెద్ద స్కోరుగా మార్చుకోలేకపోయాడు. తాజాగా శ్రీలంక ‘ఎ’తో జరిగిన రెండో మ్యాచ్‌లో 21 పరుగులకే పరిమితమయ్యాడు.
అయినప్పటికీ ఈ గణాంకాలు అతని ప్రతిభ తగ్గిందని చెప్పలేవు. వాస్తవానికి ప్రత్యర్థి జట్లు ఇప్పుడు వైభవ్‌ను అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా పరిగణిస్తూ ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. అతని బలాలు, బలహీనతలను విశ్లేషిస్తూ ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఇదే సమయంలో వైభవ్ ప్రతిభకు గుర్తింపుగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు అతను ఎంపిక కావడంతో పాటు 2026 ఆసియా క్రీడల జట్టులో కూడా స్థానం సంపాదించాడు. కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత జట్టుకు ఎంపికై, ఈ విషయంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడం విశేషం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!