టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లపై ఉండే వేరే దృష్టిని మార్చే దిశగా మరో అడుగు పడింది. పోటీల సందర్భంగా అమ్మాయిల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒలింపిక్స్ అధికారిక ప్రసారదారు ప్రకటించింది. స్పోర్ట్ అప్పీల్, నాట్ సెక్స్ అప్పీల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు నిర్వాహకులు. మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో చూపించినట్లుగా ఈ…