పతకం కోసం ఐదేళ్లు కుటుంబానికి దూరంగా మీరా బాయి చాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్ విజేత మీరా బాయి చాను…ప్రాక్టీస్ కోసం కుటుంబసభ్యులకు దూరంగా ఉంది. ఇంట్లో ఉంటే శిక్షణకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి…తల్లిదండ్రులను కలుసుకునేది కాదు. నిరంతరం కఠోరంగా శిక్షణ తీసుకోవడం వల్లే విశ్వక్రీడల్లో పతకం వచ్చేలా చేసింది. కొవిడ్ వైరస్ విజృంభణతో గతేడాది విధించిన లాక్డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది చాను. విశ్రాంతి తీసుకోవడంతో కండరాలు పట్టేసేవని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయడంతో…వీపు భాగం పట్టేసేదని…కుడి భుజానికి సమస్య వచ్చినట్లు తెలిపింది. ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కండరాలు పట్టేసేవని చెప్పింది. భుజం సమస్య వల్ల స్నాచ్ సరిగా చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది.
భుజం నొప్పి గాయం కారణంగా….అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంది మీరాబాయి. మాజీ వెయిట్ లిఫ్టర్, ఫిజియో థెరపిస్టు, డాక్టర్ ఆరోన్ హార్స్చిగ్ వద్దకు వెళ్లడం లాభం చేకూర్చిందని చాను తెలిపింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. కండరాల మధ్య సమతూకం లేదని…అందుకే, బరువులు ఎత్తగానే నొప్పి వచ్చేదని చెప్పింది. డాక్టర్ సూచించిన కొన్ని కసరత్తులు…ఉపయోగపడ్డాయని చాను వెల్లడించింది. ఐదేళ్లలో ఇంటి వద్ద గడిపింది పది రోజులేననీ, ఇప్పుడూ ఇంటి వద్ద ఎక్కువ రోజులేం ఉండనని పేర్కొంది. పది రోజులు ఉండి కామన్వెల్త్ అర్హత పోటీలకు సిద్ధమవుతానని వెల్లడించింది. తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టింది.
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!