NTV Telugu Site icon

Harry Brook: హ్యారీ బ్రూక్ వరల్డ్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్

Harry Brook

Harry Brook

Harry Brook Creates World Record In Test Formats: ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఓ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కొంతకాలం క్రితమే ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఈ 24 ఏళ్ల ఆటగాడు.. టెస్ట్ ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇప్పటివరకు ఆరు టెస్ట్ మ్యాచెస్‌లో 9 ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ.. 807 పరుగులు నమోదు చేశాడు. ప్రపంచంలో ఇలాంటి ఫీట్ మరెవ్వరూ సాధించలేదు. ఇంతకుముందు ఈ ఘనత భారత ఆటగాడు వినోద్ కాంబ్లీ పేరిట ఉండేది. తన తొలి 9 ఇన్నింగ్స్‌లలో ఆయన 798 పరుగులు చేశాడు. ఇప్పుడు 30 ఏళ్లు తర్వాత ఆ రికార్డ్‌ని హ్యారీ బ్రూక్ తిరగరాశాడు. ఇప్పటిదాకా 6 టెస్ట్ మ్యాచెస్ ఆడిన బ్రూక్ సగటు 100.8 అంటే.. అతడి పరుగుల విధ్వంసం ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అతడ్ని రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. మరి, ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడన్నది చూడాలి.

Jr. NTR political Entry: జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ గురించి మాట్లాడితే.. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమవ్వగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన జో రూట్, హ్యారీ బ్రూక్ పరుగుల వర్షం కురిపిస్తున్నారు. జో రూట్ సెంచరీ చేసుకోగా.. హ్యారీ బ్రూక్ చితక్కొట్టేస్తున్నాడు. 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 184 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ 2 వికెట్లు తీయగా, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు.

Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..