Pakistan vs New Zealand: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద తప్పు.. ఇదే తొలిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Field Umpires Changed 30 Yard Circle During Pakistan New Zealand Match In Pakistan: ఒక మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు.. ఏవైనా తప్పులు ఉన్నాయా? లేవా? అనేది చూసుకుంటారు. ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత.. ఫీల్డ్ అంపైర్లు కూడా మైదానంలోని లోటుపాట్లు గురించి ఒకసారి ఆరా తీస్తారు. అంతా రూల్స్ ప్రకారం సవ్యంగా ఉంటే.. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభిస్తారు. కానీ.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో మాత్రం.. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఒక అతిపెద్ద తప్పు బయటపడింది. అప్పటివరకూ ఆ తప్పుని గమనించలేకపోయిన ఫీల్డ్ అంపైర్లు.. నాలుగు బంతులు వేసిన తర్వాత ఆ తప్పుని పసిగట్టి, దాన్ని సరిచేశారు. ఇంతకీ.. ఆ తప్పు ఏంటని అనుకుంటున్నారా? 30 యార్డ్ సర్కిల్ కొలతలు ఎక్కువగా ఉండటం.
Twitter : ఇక ట్విట్టర్లో న్యూస్ చదవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే
Also Read
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు.. కొలతలు తప్పుగా తీసుకోవడం వల్ల, 30-యార్డ్ సర్కిల్‌ను లెక్కలు తేడా కొట్టేశాయి. అసలు దానికంటే, ఆ సర్కిల్‌ను కాస్త ఎక్కువగా పెట్టేశారు. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా తొలి ఓవర్లో నాలుగు బంతులు వేసిన తర్వాత.. ఫీల్డ్ అంపైర్లైన అలీమ్ దార్, రషీద్ రియాజ్‌లు ఈ తప్పిదాన్ని గుర్తించారు. మొదట్లోనే వాళ్లకు కొంచెం తేడాగా అనిపించినా.. నాలుగు బంతులు వేసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. దీంతో.. వెంటనే వాళ్లు మ్యాచ్‌ను ఆపేసి, గ్రౌండ్స్‌మెన్‌ను పిలిపించి, 30-యార్డ్ సర్కిల్‌ను సరిచేశారు. గ్రౌండ్స్‌మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు సైతం ఈ సర్కిల్‌ను సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు. ఇది పీసీబీ ఘనకార్యమని, క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి తప్పిదం చోటు చేసుకుందని తిట్టిపోస్తున్నారు.
Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
— Out Of Context Cricket (@GemsOfCricket) April 29, 2023
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!