NTV Telugu Site icon

Pakistan vs New Zealand: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద తప్పు.. ఇదే తొలిసారి!

Pakistan 30 Yards

Pakistan 30 Yards

Field Umpires Changed 30 Yard Circle During Pakistan New Zealand Match In Pakistan: ఒక మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు.. ఏవైనా తప్పులు ఉన్నాయా? లేవా? అనేది చూసుకుంటారు. ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత.. ఫీల్డ్ అంపైర్లు కూడా మైదానంలోని లోటుపాట్లు గురించి ఒకసారి ఆరా తీస్తారు. అంతా రూల్స్ ప్రకారం సవ్యంగా ఉంటే.. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభిస్తారు. కానీ.. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో మాత్రం.. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఒక అతిపెద్ద తప్పు బయటపడింది. అప్పటివరకూ ఆ తప్పుని గమనించలేకపోయిన ఫీల్డ్ అంపైర్లు.. నాలుగు బంతులు వేసిన తర్వాత ఆ తప్పుని పసిగట్టి, దాన్ని సరిచేశారు. ఇంతకీ.. ఆ తప్పు ఏంటని అనుకుంటున్నారా? 30 యార్డ్ సర్కిల్ కొలతలు ఎక్కువగా ఉండటం.

Twitter : ఇక ట్విట్టర్లో న్యూస్ చదవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే

మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందు.. కొలతలు తప్పుగా తీసుకోవడం వల్ల, 30-యార్డ్‌ సర్కిల్‌‌ను లెక్కలు తేడా కొట్టేశాయి. అసలు దానికంటే, ఆ సర్కిల్‌ను కాస్త ఎక్కువగా పెట్టేశారు. పాకిస్తాన్‌ బౌలర్‌ నసీమ్‌ షా తొలి ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన తర్వాత.. ఫీల్డ్ అంపైర్లైన అలీమ్‌ దార్‌, రషీద్‌ రియాజ్‌లు ఈ తప్పిదాన్ని గుర్తించారు. మొదట్లోనే వాళ్లకు కొంచెం తేడాగా అనిపించినా.. నాలుగు బంతులు వేసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. దీంతో.. వెంటనే వాళ్లు మ్యాచ్‌ను ఆపేసి, గ్రౌండ్స్‌మెన్‌ను పిలిపించి, 30-యార్డ్‌ సర్కిల్‌ను సరిచేశారు. గ్రౌండ్స్‌మెన్‌తో పాటు పాక్‌ ఆటగాళ్లు సైతం ఈ సర్కిల్‌ను సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును ట్రోల్‌ చేస్తున్నారు. ఇది పీసీబీ ఘనకార్యమని, క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి తప్పిదం చోటు చేసుకుందని తిట్టిపోస్తున్నారు.

Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

Show comments