India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటు కల్పించడాన్ని మాజీ భారత బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ ప్రశ్నించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. కోచింగ్ వ్యవస్థపై పరోక్షంగా విమర్శలు చేశారు.
‘కోచ్ ఫేవరెట్’ అంటూ వాషింగ్టన్‌పై వ్యాఖ్యలు
వాషింగ్టన్ సుందర్‌కు జట్టు యాజమాన్యం నుంచి లభిస్తున్న నిరంతర మద్దతును బద్రీనాథ్ ప్రశ్నించారు. అతను ‘కోచ్ ఫేవరెట్’గా మరోసారి జట్టులోకి వచ్చినట్లు కనిపిస్తోందని తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించారు. ఇంతకాలం లభించిన నమ్మకాన్ని సుందర్ ఈసారి తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక, నితీష్ కుమార్ రెడ్డి ఎంపికపైనా బద్రీనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అతని బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించారు. నితీష్‌ను ప్రధానంగా బ్యాటర్‌గా మాత్రమే చూస్తానని, అతడిని పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా భావించలేనని అన్నారు. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాలంటే బంతితోనూ ప్రభావం చూపడం ముఖ్యమని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు.
Also Read
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
బుమ్రా పునరాగమనం సానుకూలం
వాషింగ్టన్, నితీష్ ఎంపికపై విమర్శలు చేసినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడాన్ని బద్రీనాథ్ స్వాగతించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో బుమ్రా ఆడటం BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక, బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల ఫిట్నెస్ కూడా కీలకంగా మారింది. వీరి లభ్యతకు ఫిట్నెస్ క్లియరెన్స్ అవసరమని సమాచారం. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు జట్టు కూర్పుపై మరింత ఆసక్తి నెలకొంది.
ఆసియా క్రీడలకు సన్నాహకంగా సిరీస్
ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ భారత్‌కు ఆసియా క్రీడల సన్నాహకాల్లో కీలకంగా మారనుంది. ఈ నెల చివర్లో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ తన స్వర్ణ పతకాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను పరీక్షించేందుకు, జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కాగా, భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరగనుంది. సిరీస్ ప్రారంభానికి ముందే వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఎంపికపై చర్చ మొదలవడంతో.. బద్రీనాథ్ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!