NTV Telugu Site icon

IND vs SA: చెన్నై టెస్ట్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించిన భారత్ ఓపెనర్..

Ss

Ss

Shafali Verma Fastest Double Century: చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ ఓపెనర్ బ్యాట్సమెన్ షఫాలీ వర్మ సంచలనం సృష్టించింది. మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనింగ్ స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తొలి ఓవర్లలో కాస్త జాగ్రత్తగా ఆడిన ఆ ఆ తర్వాత స్పీడ్ పెంచుతూ పరుగులు వర్షం కురిపించారు. వీళ్ళు ఇద్దరు కలిసి తొలి వికెట్ నష్టానికి 292 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. దీంతో వీరిద్దరూ 20 ఏళ్ల పాకిస్థాన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సాజిదా షా, కిరణ్ బలోచ్ 2004లో వెస్టిండీస్‌పై వీరిద్దరూ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. స్మృతి మంధాన(149) 292 పరుగుల వద్ద ఔట్ అయ్యి వెనుదిరిగింది.

Also Read; T20 World Cup 2024: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లపై రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..

వన్ డౌన్ బ్యాట్సమెన్ గా వచ్చిన శుభా సతీష్ కూడా వెంటనే ఔట్ అయ్యింది. అయినప్పటికీ షఫాలీ ముందుకు సాగుతూ కేవలం 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వన్డే తరహా బ్యాటింగ్‌తో 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ నమోదు చేసిన షఫాలీ వర్మ.. ఆస్ట్రేలియా బ్యాటర్ అన్నబెల్ సదర్లాండ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను అధిగమించింది. ఈ క్రమంలో ప్రపంచంలో 10వ మహిళా క్రికెటర్‌గా, భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ నిలిచింది. ప్రస్తుతం టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల కోల్పోయి 525 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ 42, రిచా ఘోష్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.