IND vs SA: చెన్నై టెస్ట్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించిన భారత్ ఓపెనర్..
- టెస్ట్ మ్యాచ్ లో చరిత్ర సృష్టించిన భారత్ ఓపెనర్
- 20 ఏళ్ల పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన భరత్ ఓపెనర్లు
- ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను నమోదు చేసిన భారత క్రికెటర్
- ప్రపంచంలో డబుల్ సెంచరీ చేసిన10వ మహిళా క్రికెటర్‌గా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shafali Verma Fastest Double Century: చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ ఓపెనర్ బ్యాట్సమెన్ షఫాలీ వర్మ సంచలనం సృష్టించింది. మొదట టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనింగ్ స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తొలి ఓవర్లలో కాస్త జాగ్రత్తగా ఆడిన ఆ ఆ తర్వాత స్పీడ్ పెంచుతూ పరుగులు వర్షం కురిపించారు. వీళ్ళు ఇద్దరు కలిసి తొలి వికెట్ నష్టానికి 292 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. దీంతో వీరిద్దరూ 20 ఏళ్ల పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సాజిదా షా, కిరణ్ బలోచ్ 2004లో వెస్టిండీస్‌పై వీరిద్దరూ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. స్మృతి మంధాన(149) 292 పరుగుల వద్ద ఔట్ అయ్యి వెనుదిరిగింది.
Also Read; T20 World Cup 2024: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లపై రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..
Also Read
- Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
వన్ డౌన్ బ్యాట్సమెన్ గా వచ్చిన శుభా సతీష్ కూడా వెంటనే ఔట్ అయ్యింది. అయినప్పటికీ షఫాలీ ముందుకు సాగుతూ కేవలం 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వన్డే తరహా బ్యాటింగ్‌తో 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ నమోదు చేసిన షఫాలీ వర్మ.. ఆస్ట్రేలియా బ్యాటర్ అన్నబెల్ సదర్లాండ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను అధిగమించింది. ఈ క్రమంలో ప్రపంచంలో 10వ మహిళా క్రికెటర్‌గా, భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ నిలిచింది. ప్రస్తుతం టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల కోల్పోయి 525 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ 42, రిచా ఘోష్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..