NTV Telugu Site icon

IND vs SL: టీమిండియా వరల్డ్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు

Team India World Record

Team India World Record

Indian Cricket Team Creates World Record: టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. తిరువనంతపురంలో గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై సాధించిన విజయంతో భారత్ ఈ రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను 73 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఏకంగా 317 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఇప్పటివరకూ ఈ రికార్డ్ న్యూజీలాండ్ పేరిట ఉండేది. 2008లో కివీస్ జట్టు 290 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఇప్పుడు లేటెస్ట్‌గా టీమిండియా 27 పరుగుల తేడాతో ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టింది.

From Rifle To Pen: గన్‌ వద్దు పెన్‌ ముద్దు.. విద్య కోసం లొంగిపోయిన మావోల ప్రయాణం..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తొలుత టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. రోహిత్ శర్మ డీసెంట్ ఇన్నింగ్స్‌తో పాటు శుబ్మన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166) శతకాలతో చెలరేగడంతో.. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. చివర్లో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ లంక బౌలర్లపై తాండవం చేయడంతో.. భారత్ స్కోర్ బోర్డు పరుగులు తీసింది. ఇక 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి చిత్తుచిత్తు అయ్యింది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోండి. ఏ ఒక్కరూ క్రీజులో కుదురుగా నిలబడలేకపోయారు. తద్వారా 73 పరుగులకే ఆలౌట్ లంక ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది.

Memory Foods: ఈ ఆహారాల్ని తీసుకోండి.. జ్ఞాపకశక్తిని పెంచుకోండి

ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయడంతో, అతని ఖాతాలో పలు రికార్డులు చేరాయి. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు సచిన్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. ఆయన 20 సెంచరీలు చేశాడు. కానీ.. తాజా సెంచరీతో కోహ్లీ ఖాతాలో 21 సెంచరీలు చేరడంతో, సచిన్ రికార్డ్ బద్దలైంది. అలాగే.. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు కొట్టిన భారతీయుడిగానూ కోహ్లీ మరో ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ 9 సెంచరీలతో సచిన్ పేరిట ఆ రికార్డ్ ఉండగా.. కోహ్లీ 10 శతకాలతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.