ఈమధ్య చిన్న చిన్న విషయాలను తరచుగా మర్చిపోయే మతిమరుపు సమస్యతో యువత బాధపడుతోంది.

అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు కొన్ని ఆహారాలు సూచిస్తున్నారు. వాటిని తింటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటున్నారు.

క్యాబేజీ, ఉల్లిపాయలు, బ్రోకలీ వంటి కూరగాయల్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడుతాయి.

పాలు, పెరుగు, కొవ్వు చేపలు, చిక్కుళ్ళు, బీన్స్, గుమ్మడి గింజలు, గోధుమలు, బార్లీ, వోట్స్‌లో ఉండే మెగ్నీషియం.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

మొలకలు, బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంపల్లో కారిటినాయిడ్స్ అనే మూలకం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

గుడ్డు సొనలు, తృణధాన్యాలు, సోయాబీన్స్, నువ్వుల గింజల్లో ఉండే లెసిథిన్.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

విటమిన్ బి12 పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్, చేపలు, పాలు వంటి ఆహారాలను తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

నిమ్మ, నారింజ, ఉసిరి, క్యాప్సికం, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు.. మెదడు పనితీరు కూడా మెరుగుపరుస్తాయి.

బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, అత్తి పండ్‌లు, గింజల్లో ఉండే విటమిన్-ఈ.. మెదడు పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది.