Site icon NTV Telugu

IND Vs SA 1st T20: టాస్ గెలిచిన టీమిండియా.. పంత్, అశ్విన్, అర్ష్‌దీప్, దీపక్ చాహర్ ఇన్..!!

Team India

Team India

IND Vs SA 1st T20: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ మొదలైంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు పలు మార్పులు చేసింది. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. ఆశ్చర్యకరంగా తొలి మ్యాచ్‌కు బుమ్రాను కూడా దూరం పెట్టారు. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్‌కు అవకాశం కల్పించారు. అటు ప్రధాన స్పిన్నర్ చాహల్‌కు విశ్రాంతి ఇచ్చి అశ్విన్‌కు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. రిషబ్ పంత్, దీపక్ చాహర్‌లకు కూడా స్థానం దక్కింది.

తుది జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, అశ్విన్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రోసౌ, మార్‌క్రమ్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, పార్నెల్, రబాడ, కేశవ్ మహరాజ్, నోర్జ్, షాంసీ

Exit mobile version