NTV Telugu Site icon

IND vs SL 2nd ODI: శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం

India Won Match

India Won Match

India Won ODI Series Against Sri Lanka: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. లంక కుదిర్చిన 216 పరుగుల లక్ష్యాన్ని.. ముక్కుతూ, మూలుగుతూ అతి కష్టం మీద భారత్ చేధించింది. టాపార్డర్ చేతులు ఎత్తేసిన నేపథ్యంలో.. కేఎల్ రాహుల్ (64) భారత్‌కి అండగా నిలిచాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అఫ్‌కోర్స్.. అతడు మరీ నిదానంగా రాణించినప్పటికీ, కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆదుకోవడం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యం కూడా చిన్నదే కాబట్టి, ఆచితూచి రాణించాడు. చివరివరకూ క్రీజులోనే ఉంటూ, ఇతర ఆటగాళ్లతో మంచి పార్ట్నర్‌షిప్‌లు నెలకొల్పుతూ.. భారత్‌కి విజయాన్ని అందించాడు.

Putin: “పుతిన్‌కు నెక్ట్స్ బర్త్ డే ఉండదు”.. వాళ్లే చంపుతారు.. రష్యా ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు..

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 215 పరుగులకే కుప్పకూలింది. మొదట్లో నువానిదు ఫెర్నాండో (50), కుసల్ మెండిల్ (34) కలిసి అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లెవ్వరూ సత్తా చాటలేకపోయారు. భారత బౌలర్ల దెబ్బకు.. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో వచ్చిన దునిత్ (32) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు కానీ, మిగతా వాళ్లు చేతులెత్తేశారు. గత వన్డేలో సెంచరీతో చెలరేగిన షణక ఈ మ్యాచ్‌లో మళ్లీ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తే.. అతడు కూడా నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో.. శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలోనే 215 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బౌలర్లలో కుల్దీన్, సిరాజ్‌లు లంక బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు.

Flipkart Fined: డెలివరీ చేయలేదు ఫోన్‌.. పడింది ఫైన్‌..

ఇక 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి లంక బౌలర్లు గట్టి షాక్‌లే ఇచ్చారు. టాపార్డర్‌ని కుప్పకూల్చారు. ఈ దెబ్బకు టీమిండియా కష్టాల్లో పడింది. అప్పుడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి జట్టుని ఆదుకున్నారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి పుణ్యమా అని, కష్టాల్లో ఉన్న భారత జట్టు గట్టెక్కింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వెన్నెముకలాగా నిలబడ్డాడు. అక్షర్ పటేల్‌తోనూ అతడు మంచి పార్ట్నర్‌షిప్ జోడించాడు. చివరగా కుల్దీప్ యాదవ్‌తో కలిసి.. భారత్‌ని గెలిపించాడు. ఈ మ్యాచ్ గెలవడంతో.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ భారత్ కైవసం అయ్యింది. భారత్ స్కోర్: 219/6.

Minister KTR: పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్ భేటీ.. పెట్టుబడులపై చర్చ