India Won First ODI In Wakhande Against Australia: వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 188 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాస్త కష్టంగానే చేధించింది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో భారత్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాపార్డర్ ఘోరంగా విఫలమై, భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగినప్పుడు.. నేనున్నానంటూ కేఎల్ రాహుల్ ఒంటిచేత్తో పోరాడి గెలిపించాడు. అతనికి హార్దిక్ పాండ్యా (25), రవీంద్ర జడేజా (45) మద్దతు తెలపడంతో.. టీమిండియా నెగ్గగలిగింది. ఇంకా పది ఓవర్లు మిగిలుండగానే.. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయఢంకా మోగించింది.
TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు
తొలుత భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. ఒక్క మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా ఆసీస్ బ్యాటర్లు భారత బౌలర్ల ప్రతాపం ముందు నిలబడలేకపోవడంతో.. ఆసీస్ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది. 189 పరుగుల లక్ష్యం చిన్నదే కాబట్టి.. భారత్ సునాయాసంగా చేధిస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలకు భిన్నంగా టాపార్డర్ గట్టి షాక్ ఇచ్చింది. ఇషాన్ కిషన్ (3), శుభ్మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్య కుమార్ యాదవ్ (0) చేతులు ఎత్తేయడంతో.. భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో.. భారత్ లక్ష్యాన్ని చేధించగలుగుతుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది.
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక.. అతడే కీలక సూత్రధారి
అలాంటి కష్ట సమయంలో రంగంలోకి దిగిన భారత్.. పునాదిలాగా నిల్చుండిపోయాడు. ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా, ఆచితూచి ఆడుతూ జట్టుని ముందుకు నడిపించాడు. తొలుత హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి.. భారత్‌ని గాడిలో పెట్టాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి.. భారత్‌ని విజయతీరాలకు చేర్చాడు. చివర్లో జడేజా సైతం విజృంభించడంతో, 10.1 ఓవర్లు మిగిలుండగానే భారత్ 191 పరుగులు చేసి, మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. ఏదేమైనా.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ‘హీరో’గా నిలిచాడు. సరైన సమయంలో హుందాగా ఆడి, తన సత్తా చాటాడు.