IND Vs IRE: రాణించిన దీపక్ హుడా, చాహల్.. తొలి టీ20లో టీమిండియా విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లుగా దీపక్ హుడా, ఇషాన్ కిషన్ బరిలోకి దిగి ఆశ్చర్యపరిచారు. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో దీపక్ హుడా ఓపెనింగ్‌కు వచ్చాడు. దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 47 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. హార్డిక్ పాండ్యా 12 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ మరోసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతడు 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ 2 వికెట్లు పడగొట్టగా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నాడు. మూడు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టిన చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా రెండు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Also Read
- Rohit Sharma: ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్‌కు ప్రధాన సమస్య!
- Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
Cricket: చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
తాజావార్తలు
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్‌కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!