Team India: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 15 ఏళ్లు గడిచినా మరోసారి టీమిండియా మాత్రం మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సెమీస్‌కు చేరిన రోహిత్ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. సమష్టిగా ఆడితే ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం అసాధ్యమేమీ కాదని అభిమానులు విశ్వసిస్తున్నారు. అటు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్ చేరితే ఈ ప్రపంచకప్‌కు అంతకంటే మజా మరొకటి ఉండదు. అప్పుడు ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడితే 2007 మేజిక్ మరోసారి రిపీట్ కావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
Read Also: Monkeys To Space: అంతరిక్షంలోకి కోతులు.. పునరుత్పత్తిపై కీలక ప్రయోగం!
అటు 2007 తరువాత టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. 2007 తరువాత మళ్లీ 2022లోనే ఈ రెండు జట్లు కలిసి సెమీస్ చేరాయి. గతంలో ఈ రెండు జట్లు వేర్వేరుగా సెమీస్ చేరాయి. కొన్నిసార్లు భారత్ సెమీస్‌కు వెళ్లగా మరికొన్ని సార్లు పాకిస్థాన్ మాత్రమే సెమీస్ చేరింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఆడనున్న సెమీ ఫైనల్స్‌లో భారత్, పాకిస్థాన్ తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్ చేరాలని ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 2007లో జరిగిన ఫైనల్ పోరులో నాలుగు పరుగుల తేడాతో టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్‌గా ఆవిర్భవించగా పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
