NTV Telugu Site icon

IND vs SL: కోహ్లీ, రోహిత్‌ శర్మ అరుదైన పీట్‌..!

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య రేపు జరగనున్న తొలి టెస్ట్‌కు… ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. టీమిండియాలోని విరాట్ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలకు ఈ మ్యాచ్‌ మైలురాయి కానుంది. 100వ టెస్ట్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లీ ఒకరైతే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌ బాధ్యతలు చేపడుతున్న రోహిత్‌ శర్మ మరొకరు. మొహాలీ టెస్ట్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని కోహ్లీ, రోహిత్‌ భావిస్తున్నారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ గెలుపొందిన భారత్‌…ఆ తర్వాత లంకతో మూడు టీ20ల సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసింది. రెట్టించిన ఉత్సాహంలో ఉన్న రోహిత్‌ సేన…టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

Read Also: Telangana: ఉద్యోగుల పరస్పర బదిలీల్లో సీనియారిటీ ప్రొటెక్షన్