NTV Telugu Site icon

IND vs SA: లాస్ట్ పంచ్ ఎవరిది..?

Ind Vs Sa

Ind Vs Sa

భారత్, దక్షిణాఫ్రికా మధ్య స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ నాలుగు మ్యాచ్‌లు ముగియగా.. చెరో రెండు విజయాలతో ఇరు జట్లు సిరీస్‌ని సమం చేశారు. ఇప్పుడు ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇరు జట్లకి ఇది తాడోపేడో మ్యాచ్! ఎవరు గెలుస్తారో, వారికే సిరీస్ దక్కుతుంది. మొదట్లో భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, దక్షిణాఫ్రికా సునాయాసంగా ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు.

తొలి మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకోకపోవడం, రెండో మ్యాచ్‌లో బ్యాట్స్మన్లు చేతులు ఎత్తేయడంతో.. భారత ఆటగాళ్లు నిలకడగా రాణించడం లేదని, కచ్ఛితంగా సిరీస్ భారత్ చేజారుతుందని భావించారు. కానీ, ఆ విమర్శలకు చెక్ పెడుతూ తర్వాతి రెండు మ్యాచెస్‌ని భారత్ కైవసం చేసుకుంది. అది కూడా భారీ తేడాలతో ఘన విజయాలు నమోదు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి.. దక్షిణాఫ్రికా జట్టుని పీల్చి పిప్పి చేశారు భారత్. అదే ఫామ్‌ని కొనసాగిస్తే, కచ్ఛితంగా లాస్ట్ పంచ్ కూడా మనదే అవుతుంది. సౌతాఫ్రికా ఆటగాళ్ల బలహీనతల్ని బౌలర్లు పసిగట్టేశారు కాబట్టి, గత రెండు మ్యాచెస్‌లో రచించిన వ్యూహాల్నే రిపీట్ చేస్తే.. తక్కువ స్కోరుకే కట్టడి చేయొచ్చు.

అటు, భారత బ్యాట్స్మన్లు కూడా ఫుల్ జోష్ మీదున్నారు. ఒకరు విఫలమైనా, మరొకరు నిలకడగా రాణిస్తూ.. పరుగుల వర్షం కురిపిస్తున్నారు. టాపార్డర్ ఫెయిలైనా, మిడిలార్డర్‌ బ్యాట్స్మన్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇది అత్యంత కీలకమైన మ్యాచ్.. కాబట్టి బ్యాట్స్మన్లు, బౌలర్లు కచ్ఛితంగా సత్తా చాటాల్సి ఉంటుంది. టీమిండియా ఫుల్ ఫామ్‌లో ఉండడంతో, దాదాపు ఈ మ్యాచ్ భారత్‌దేనని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. మరి, ఫలితాలు ఎలా నమోదవుతాయో లెట్స్ వెయిట్ అండ్ సీ!