Site icon NTV Telugu

నేడు బిగ్‌ మ్యాచ్… పాకిస్థాన్‌తో భారత్ ఢీ

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఈరోజు బిగ్‌ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0 తేడాతో గెలిచిన భారత్.. పాకిస్థాన్‌తోనూ అదిరిపోయే ఆటతో ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also: కోహ్లీ వ్యాఖ్యలపై ‘మేం చూసుకుంటాం’ అని స్పందించిన దాదా

2018 మస్కట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ట్రోఫీని భారత్-పాకిస్థాన్ జట్లు పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ల హోదాలో ఈరోజు ఈ రెండు జట్లు అమీతుమీకి దిగనున్నాయి. అయితే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డులు మాత్రం పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు మొత్తం 9 సార్లు తలపడగా పాకిస్థాన్ ఏకంగా ఏడుసార్లు విజయం సాధించింది. కాగా ఇటీవల టీ20 ప్రపంచకప్ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై ఓటమితో అభిమానులను నిరాశ పరిచిన టీమిండియా హాకీలో అయినా గెలిచి దేశ ప్రతిష్టను పెంచాలని యావత్ భారతం కోరుకుంటోంది.

Exit mobile version