India vs Pakistan: ‘‘కొలంబోలో మసీదు ఉంది, ఈసారి పాక్ గెలుస్తుంది’’.. ఇలా ఉన్నారేంట్రా..

  • కొలంబోలో మసీదు ఉంది, పాక్ గెలుస్తుంది..
  • పాక్ జర్నలిస్ట్ ఫన్నీ అనాలిసిస్..
India Vs Pakistan

India Vs Pakistan

India vs Pakistan: టీ20 వరల్డ్ కప్‌లో ఈ రోజు హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగబోతోంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రెండు దేశాల ఫ్యాన్స్ శ్రీలంకకు చేరిపోయారు. వీరిలో పాటు క్రికెట్ మాజీలు, పలువురు సెలబ్రేటీలు ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. ఐసీసీ టోర్నీలో భారత్‌కు పాకిస్తాన్ పై మంచి రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ కొనసాగాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఈ సారి భారత్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

Read Also: Sharwanand : శర్వానంద్ – శ్రీనువైట్ల మొదలు పెట్టబోతున్నారు

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ అనలిస్టులు చేస్తున్న హడావిడి మరో ఎత్తు. పాకిస్తాన్ అంటేనే మతోన్మాద దేశం. ఆర్మీ, ఆటలు, రాజకీయాలు అన్ని అక్కడ మతంతో ముడిపడి ఉన్నాయి. ఓ టీవీ ఛానెల్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై డిబేట్ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ జర్నలిస్ట్ చేసిన ఫన్నీ కామెంట్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. ‘‘కొలంబోలోని హోటల్ వెనక ఒక అందమైన మసీదు ఉంది. అక్కడ ముస్లిం జనాభా పెరుగుతోంది. కాబట్టి భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపొందుతుంది’’ అనడం వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆటను మతాన్ని కలిపి చూడటం ఏంట్రా అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి నాన్సెన్స్ మాటలు ఎందుకు?? అని పాకిస్తాన్ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో మ్యాచ్ గెలుస్తారు, హోటల్ నుంచి మసీదు కనిపించడం ద్వారా గెలవరు అని కామెంట్స్ పెడుతున్నారు.