IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 513 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకీర్ హసన్ (55), నజ్ముల్ హుస్సేన్ శాంతనో (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ వికెట్లు తీయాలని టీమిండియా మూడో రోజు మూడో సెషన్‌లోనే తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా బంగ్లాదేశ్ మాత్రం ఊహలకు అందని విధంగా రాణిస్తోంది.
Read Also: West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత
దీంతో తొలి టెస్టు ఫలితంపై ఆసక్తి పెరుగుతోంది. ఇంకా ఐదు సెషన్‌ల ఆట మిగిలి ఉండటంతో టీమిండియా బౌలర్లు శ్రమిస్తే తప్ప బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఒకవేళ బౌలర్లు మూకుమ్మడిగా విఫలమైతే బంగ్లాదేశ్ సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉందని టీమిండియా గ్రహించాలి. ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నట్లు కనిపిస్తోంది. మూడో రోజు బంగ్లాదేశ్ ఆలౌట్ కాగానే ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా భారత జట్టు బ్యాటింగ్ చేయడం కరెక్టేనా అని టీమిండియా ప్లాన్‌పై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నిపుణులు మాత్రం భారత్ చేసిన పని కరెక్టే అంటున్నారు. మరి ఈ టెస్టు ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాలి.