NTV Telugu Site icon

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!

Ind Vs Aus Odi Series

Ind Vs Aus Odi Series

India vs Australia ODI Series Schedule Details: నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించి, ప్రతిష్టాత్మక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని ముద్దాడిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించి.. వన్డే సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది. అటు.. టెస్ట్ సిరీస్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన ప్రత్యర్థి జట్టు ఆసీస్ సైతం ఈ వన్డే సిరీస్ నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 17వ తేదీ నుంచి స్వదేశంలోనే జరగనుంది. అయితే.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డే మ్యాచ్‌కు దూరం (ఫ్యామిలీ ఫంక్షన్) కావడంతో.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇండియన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ తల్లి మరణం నేపథ్యంలో దూరం అవ్వడంతో.. అతని స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

Husband Missing: పెళ్లయిన మూడు నెలలకే భర్త అదృశ్యం.. అసలేమైంది?

ఈ వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మార్చి 17వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ మార్చి 19వ తేదీన విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఇక మార్చి 22వ తేదీన జరగనున్న చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి.

India invites Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రికి భారత్ ఆహ్వానం..

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ (తొలి వన్డేకు కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్‌, శ్రేయస్ అయ్యర్ (వెన్నునొప్పి కారణంగా దూరం)

ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, నాథన్‌ ఎల్లిస్‌