IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు ఐదో మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ సమం అవుతుంది. మరోవైపు ఆతిథ్య ఆసీస్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. స్వదేశంలో సిరీస్ కోల్పోకూడదని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో కంగారూల శైలికి తగినట్లు చక్కటి బౌన్స్ ఉండే గాబా మైదానంలో ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Also: Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు
అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుభ్ మన్ గిల్ వన్డే, టీ20 ఫాంపై తీవ్ర చర్చ కొనసాగింది. నిజంగానే అతను తడబడ్డాడు. రెండు ఫార్మాట్లలో 7 ఇన్నింగ్స్‌లు కలిపి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో బాగా ఆడి ఘనంగా ముగింపు పలకాలని గిల్ అనుకుంటున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడును ఆడుతుండగా, సూర్య కుమార్ యాదవ్ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత 18 ఇన్నింగ్స్‌లలో సూర్య ఒక్కసారి కూడా అర్థ శతకం చేయలేదు. అలాగే, తిలక్ వర్మ కూడా తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో భారత్ చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో గెలిచిన, మన బ్యాటింగ్‌లో వైఫల్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లతో పాటు శివమ్ దూబే రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చుతున్నాడు.
Read Also: Deputy CM Pawan Kalyan: నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఇక, మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు కష్టం అని చెప్పాలి. వరుసగా రెండు విజయాలు అందించిన తుది జట్టులో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయికి ఒకే ఒక వికెట్ దూరంలో జస్ప్రీత్ బూమ్రా ఉన్నారు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన ఆటగాళ్లు హేజల్‌వుడ్, హెడ్‌లాంటి వాళ్లు సిరీస్ నుంచి మధ్యలో తప్పుకున్న తర్వాత కంగారుల జట్టులో తడబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ తరహాలో నెమ్మదైన పిచ్‌లు ఉన్న హోబర్ట్, కరారాలలో ఆసీస్ జట్టు బ్యాటర్లు పూర్తిగా వైఫల్యం చెందారు. మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఫలితంగా తక్కువ స్కోర్లతో జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.
Read Also: Samantha : రాజ్ నిడుమోరుకు సమంత హగ్.. కన్ఫర్మ్ చేసేస్తున్నారా..
కాగా, ఆస్ట్రేలియా జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది. కనీసం సిరీస్‌ను ‘డ్రా’గానైనా ముగించాలని చూస్తుంది. మిచెల్ మార్ష్ ఒక్కడే బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతున్నాడు, మిగతా వారంతా విఫలమయ్యారు. టాప్–4లో షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్ రాణిస్తే ఆసీస్ భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమి కాదు. మ్యాక్స్‌వెల్ ఇక్కడైనా మెరుస్తాడేమో వేచి చూడాలి. జట్టు బౌలింగ్‌లో అనుభవలేమి అనేది క్లియర్ గా కనిపిస్తోంది. భారత స్పిన్నర్లు చెలరేగిన చోట ఆడమ్ జంపా భారీగా రన్స్ ఇస్తున్నాడు. అయితే, ఈ మ్యాచ్ కి స్వల్ప వర్షం ముప్పు పొంచి ఉంది.