Ind vs Aus 3rd ODI: సిడ్నిలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 237 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 రన్స్ కే కంగారు జట్టు ఆలౌటైంది. ఆతిథ్య బ్యాటర్లలో మ్యాట్ రెన్‌షా (56) హాఫ్ సెంచరీ చేయగా, భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్ల తీసుకోగా.. సిరాజ్, కుల్‌దీప్, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆరుగురు టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేశారు. అందరు వికెట్లు తీయడం గమనార్హం. 1986 తర్వాత ఇలా ఆసీస్‌పై ప్రతి ఒక్క బౌలరూ వికెట్ తీయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.
Read Also: Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…
కాగా, సిడ్నీ పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ తీసుకుంది. అందుకు తగినట్టుగానే ఓపెనర్లు తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్‌కు భారీ లక్ష్యం తప్పదని అందరు అనుకున్నారు. కానీ, సిరాజ్ అద్భుతమైన బంతిని ఆడబోయిన ట్రావిస్ హెడ్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోని ప్రసిద్ధ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే మిచెల్ మార్ష్‌ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక, మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ కేరీ(24)తో కలిసి రెన్‌షా ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోసారి టీమిండియా బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ క్రమంగా వికెట్లను కోల్పోయింది. రెన్‌షా ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ అద్భుతంగా పట్టుకున్నాడు. చివర్లో కూపర్ కనోలీ (23), నాథన్ ఎల్లిస్ (16) కాస్త దూకుడుగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియా స్కోరు 230 పరుగులు దాటింది. కీలక సమయంలో ఎల్లిస్‌ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో.. కంగారు జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా టైం పట్టలేదు. అలాగే, అలెక్ట్ ఇచ్చిన క్యాచ్ పడుతూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడు స్టేడియం వీడాడు.
