Site icon NTV Telugu

Womens World Cup: రేపే ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు రంజుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్‌ గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి మహిళల మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి ఈ పోరు పట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

కాగా మ‌హిళ‌ల క్రికెట్‌లోనూ పాకిస్థాన్‌పై భారత జట్టుకు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వ‌ర‌కు పాకిస్థాన్‌పై 10 వ‌న్డేల్లో భారత మహిళల జ‌ట్టు గెలిచింది. 11 సార్లు జ‌రిగిన టీ20 మ్యాచుల్లోనూ ఒక్కసారి మాత్రమే ఇండియా ఓడిపోయింది. స్మృతి మందాన ఈ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ఇండియా నెగ్గింది. పాకిస్థాన్‌తో రేపు జ‌రిగే మ్యాచ్‌లోనూ ఇండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మ‌హ‌రూఫ్ ఇటీవ‌లే మెట‌ర్నటీ లీవ్ నుంచి వ‌చ్చేసింది. ఆరు నెలల కూతురు ఉన్న ఆమె భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనుంది.

https://ntvtelugu.com/ravindra-jadeja-beats-35-years-of-kapildev-record/
Exit mobile version