IND Vs SL: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు గౌహతిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రతి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఆటతీరు ఎలా ఉంటుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also: Keerthy Suresh : గ్లామర్ డోస్ పెంచిన మహానటి
ఈ వన్డే సిరీస్‌లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పరిస్థితి అయోమయంగా మారింది. కేఎల్ రాహుల్ రావడంతో అతడికి జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. రోహిత్ ఎవరిని తీసుకుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు తిరుగులేదు. ముఖ్యంగా 2019, 2020, 2021లో అతడు పరుగుల వరద పారించాడు. గతేడాది నుంచి నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 2022లో 10 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 27.89 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అటు మిడిలార్డర్ ఫుల్ ప్యాకప్‌గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. అటు బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్, సిరాజ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.