Site icon NTV Telugu

Team India Playing 11: ఆయుష్ అరంగేట్రం.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!

Team India Playing 11

Team India Playing 11

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన బదోని.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్, సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓపెనర్‌లుగా ఆడనున్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా.. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడుతాడు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, ఆయుష్ బదోనిలు ఆడనున్నారు. స్పిన్ విభాగాన్ని కుల్దీప్ యాదవ్ నడిపించనుండగా.. పేస్ విభాగంలో మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తంగా సీనియర్, జూనియర్ కలయికతో భారత జట్టు మరోసారి న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమైంది. ఈరోజు అరంగేట్రం చేయనున్న ఆయుష్ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అనుహ్యంగా ఆయుష్ బదోనికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. నేడు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. నితీశ్ రెడ్డి మరో ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నా.. బదోని వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో బదోనికి అద్భుతమైన రికార్డు ఉంది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి.. 693 రన్స్, 10 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో లక్నో తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. బదోని ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేయగలడు. జడేజా మాదిరి మరో ఆల్‌రౌండర్‌గా బదోనిని చేయాలని మెనెజ్‌మెంట్ చూస్తోంది.

Also Read: Virat Kohli Record: ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ.. మొదటి బ్యాటర్‌గా ‘కింగ్’ కోహ్లీ రేర్ రికార్డు!

భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్), రవీంద్ర జడేజా, ఆయుష్ బదోని, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్.

 

Exit mobile version