భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా వన్డే మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనిని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. బుధవారం రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులోకి రానున్నాడు. బదోని బ్యాటర్ మాత్రమే కాదు.. ఆఫ్ స్పిన్నర్ కూడా. మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్…