ఏ సిరీస్ అన్నది కాదు.. అందులో భారత్, పాకిస్థాన్ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే.. ఎప్పుడూ క్రికెట్‌ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్‌కప్ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.. ఐసీసీ ఇవాళ గ్రూపులను ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య యూఏఈలో టీ20 వరల్డ్‌కప్ జరనుండగా.. సూపర్ 12లో టీమిండియా గ్రూప్ 2లో ఉంది.
ఇక, గ్రూపుల విషయానికి వస్తే.. గ్రూప్ 1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ ఎ విజేత, గ్రూప్ బి రన్నరప్.. గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ ఎ రన్నరప్, గ్రూప్ బి విజేత… గ్రూప్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి..