IND vs SA: అదరగొట్టిన అవేశ్‌ఖాన్.. నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు… నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. అవేశ్ ఖాన్ (4/18) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి
యువ పేసర్ అవేశ్ ఖాన్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సఫారీలను కకావికలం చేశాడు. అవేష్ ఖాన్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, 170 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేశ్ ఖాన్‌కు తోడు చాహల్ (2 వికెట్లు), హర్షల్ పటేల్ (1 వికెట్), అక్షర్ పటేల్ (1 వికెట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా అలవోకగా గెలుపు తీరాలకు చేరుకుంది.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఛేదనలో దక్షిణాఫ్రికా పూర్తిగా తడబడింది. ఏ దశలోనూ ఆ జట్టుకు మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపించలేదు. గాయంతో బవుమా (8 రిటైర్డ్‌హర్ట్) తప్పుకోగా, డికాక్ (14) అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రిటోరియస్ (0) విఫలం కాగా, ఈ సిరీస్‌లో సఫారీ టీమ్‌కు బలంగా నిలిచిన ముగ్గురు బ్యాటర్లు క్లాసెన్ (8), మిల్లర్ (9), వాన్ డర్ డసెన్ (20) తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో 14 ఓవర్లోనే ఆ జట్టు గెలుపు ఆశలు దాదాపుగా కోల్పోయింది. అవేశ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం విశేషం. తర్వాత వచ్చినవారిలో ఎవరూ ప్రభావం చూపలేకపోవడంతో సఫారీ ఓటమి ఖాయమైంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-2తో సమవజ్జీగా నిలిచింది. ఇక నిర్ణాయక ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!