Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ చరిత్ర!

  • టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు
  • టీ20 వరల్డ్‌ కప్‌లలో 40 విజయాల మార్క్‌
  • నెదర్లాండ్స్‌పై విజయంతో భారత్ ఖాతాలో రికార్డు
Team India History

Team India History

Team India Creates All-Time Records List in T20 World Cups: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్‌ కప్‌లలో 40 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌పై విజయంతో ఈ రికార్డు భారత్ ఖాతాలో చేరింది. మెగా టోర్నీలో మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 40 విజయాలు సాధించింది. స్థిరమైన ప్రదర్శన, బలమైన బ్యాటింగ్ లైనప్‌, కచ్చితమైన బౌలింగ్‌ కాంబినేషన్‌తో భారత్ ఈ ఘనత సాధించడం విశేషం. 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి భారత్ స్థిరమైన ప్రదర్శన చేయడంతో ఈ రేర్ రికార్డు సాధ్యమైంది.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టీమ్‌ల విజయాల జాబితాలో భారత్ తర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ తలా 36 విజయాలు సాధించాయి. మూడో స్థానంలో దాయాది పాకిస్థాన్ ఉండగా.. 33 విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలో 31 విజయాలతో సమానంగా నిలిచాయి. న్యూజీలాండ్, వెస్టిండీస్ జట్లు 28 విజయాలతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ 13 విజయాలు, బంగ్లాదేశ్ 12 విజయాలు నమోదు చేశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే.. భారత్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.

Also Read: Surya Kumar Yadav: ఇక తేలికగా తీసుకోము, అందరికీ కఠిన పరీక్షే.. సూర్యకుమార్ వార్నింగ్!

టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్స్ విజయాల రికార్డు లిస్ట్:
40 – భారతదేశం (56 మ్యాచ్‌లు)
36 – దక్షిణాఫ్రికా (53)
36 – శ్రీలంక (57)
33 – పాకిస్తాన్ (55)
31 – ఆస్ట్రేలియా (50)
31 – ఇంగ్లాండ్ (56)
28 – న్యూజిలాండ్ (50)
28 – వెస్టిండీస్ (49)
13 – ఆఫ్ఘనిస్తాన్ (33)
12 – బంగ్లాదేశ్ (45)