Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India First Team to Win 200 T20I Matches: టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో అద్భుత విజయం సాధించిన భారత్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండొందల విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ భారత్‌కు 300వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
భారత్ ఇప్పటివరకు 300 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 200 విజయాలు సాధించింది. 83 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. మరో ఏడు మ్యాచ్‌లు టైగా ముగియగా.. 10 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 విజయాల మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో పాకిస్థాన్ 176 విజయాలతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 135, దక్షిణాఫ్రికా 129, ఇంగ్లండ్ 128, ఆస్ట్రేలియా 127 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీ20ల్లో భారత్ ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఈ సంఖ్య మరింత పెరగనుంది.
Also Read
- Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
- NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
- PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
- IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే తెలుగు ప్లేయర్స్ తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. తిలక్ 26 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలవగా.. నితీశ్ కేవలం 13 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. చివరి వరకు పోరాడిన భారత జట్టు 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!