India vs Zimbabwe: సెంచరీతో చెలరేగిన శుభ్మన్.. భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Batting Innings Completed In 3rd ODI Against Zimbabwe: ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు గెలిచి, సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈరోజు జింబాబ్వేతో మూడో మ్యాచ్ ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఎడా పెడా షాట్లతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత ఆచితూచి ఆడిన శుభ్మన్.. ఆ తర్వాత భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. ఇతనితో పాటు చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ కూడా అర్థశతకంతో దుమ్ము దులిపేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ నిదానంగా రాణించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 15 ఓవర్లో కేఎల్ రాహుల్ బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్‌లో చివరి బంతికి ఔటయ్యాడు. అతని తర్వాత వెంటనే శిఖర్ ధావన్ పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులో ఉన్న శుభ్మన్, ఇషాన్.. జింబాబ్వే బౌలర్లకు మరో వికెట్ చిక్కకుండా ఆచితూచి ఆడారు. వీలు చిక్కునప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడో వికెట్‌కి 140 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అనంతరం ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. అయితే.. అతని తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లెవరూ పెద్దగా రాణించలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు.
Also Read
- Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
- Ajinkya Rahane: రూమ్‌కు రూల్.. ఎంఎస్ ధోనీ తలుపు మూసి ఉంటే అంతే..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
కానీ.. శుభ్మన్ మాత్రం తడబడలేదు. అప్పటికే క్రీజులో కుదురుకున్న అతడు, పరుగుల వర్షం కురిపిస్తూ భారత్ స్కోర్ బోర్డును పెంచుకుంటూ వెళ్లాడు. ఆ జోష్‌లోనే చివరి 50వ ఓవర్‌లో శుభ్మన్ ఔటయ్యాడు. శార్దూల్ కూడా భారీ షాట్ కొట్టబోయే, వెంటనే వెనుదిరిగాడు. దీంతో.. మొత్తం 50 ఓవర్లలో భారత్ 289 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఫైఫర్ (5 వికెట్లు)తో చరిత్ర సృష్టించాడు. విక్టర్, ల్యూక్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచుల్లో జింబాబ్వే 200 పరుగుల మైలురాయిని అందుకోలేదు. కాబట్టి, ఈ లక్ష్యం వారికి పెద్దదే! చూస్తుంటే, ఈ మ్యాచ్ కూడా భారత్‌దేనని అనిపిస్తోంది. అదే జరిగితే, క్వీన్ స్వీప్ చేసినట్టే!
తాజావార్తలు
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!