Hyderabad: ప్రస్తుతం టీమిండియా బిజీ షెడ్యూల్‌తో క్రికెట్ ఆడుతోంది. ఇటీవల ఆసియా కప్ ఆడిన భారత్ సొంతగడ్డపై ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్, ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఆస్ట్రేలియాతో మూడో టీ20ని ఈనెల 25న టీమిండియా ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. దాదాపుగా రెండేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది.
Read Also: Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం రివార్డు.. రూ.50 లక్షలు అందజేత
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాలు ఈనెల 15 నుంచి మొదలు కానుంది. పేటీయం ఇన్‌సైడర్ (ఆన్‌లైన్) ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా స్టేడియం వద్దనున్న ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా టికెట్లను అభిమానులు కొనుగోలు చేసుకునే వెసులుబాటును నిర్వాహకులు కల్పించారు. రూ.800 నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభం కానున్నాయి. ఈ టికెట్ ధరలకు అభిమానులు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈనెల 20న తొలి టీ20, ఈనెల 23న రెండో టీ20, ఈనెల 25న మూడో టీ20 జరగనున్నాయి. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
