Site icon NTV Telugu

Ind vs Aus: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన వన్డే టికెట్స్.. నిరాశలో క్రికెట్ ఫ్యాన్స్

Vishaka Cricket Gorund

Vishaka Cricket Gorund

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైల్లో పెట్టిన ఆరగంటకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. పేటీఎం యాప్, పేటీఎం ఇన్ సైడర్ యాప్, ఇన్ సైడర్. ఇన్ వెబ్ ల నుంచి టికెట్స్ కొనుగోలు చేశారు.

Also Read : OYO Founder : ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ ఇంట్లో విషాదం

ఇక భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఆన్ లైన్ టికెట్స్ ముగియడంతో క్రికెట్ ప్రేక్షకులు ఆఫ్ లైన్ లో టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14 నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం-బీ, జీవీఎంసీ మున్సిపాల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణాల్లో కొనుగోలు చేయవచ్చని నిర్వహకులు వెల్లడించారు. టికెట్ ధరలు రూ.600, రూ.1,500, రూ. 2000, రూ. 3000, రూ.3,500, రూ. 6000గా ఉండే అవకాలున్నాయి. ఇప్పటికే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ జరుగుతుంది.

Also Read : Holi Harassment: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు

ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే టోర్నీ ఆరంభమవుతుంది. ఇది మూడు వన్డేల సిరీస్. ఇందులో తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్డే 19న విశాఖపట్నంలో జరుగుతుంది. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతంది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ మాత్రమే జరిగింది.

Also Read : TV Rama Rao Resigns YSRCP: వైసీపీకి షాక్..! పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..

Exit mobile version