NTV Telugu Site icon

Cheteshwar Pujara BCCI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. చెతేశ్వర్‌ పుజారాను అందుకే ఎంపిక చేయలేదు: బీసీసీఐ

Untitled Design (2)

Untitled Design (2)

Why Cheteshwar Pujara Dropped From IND vs WI Test Teries: భారత్, వెస్టిండీస్ పర్యటన జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. టెస్ట్ టీమ్‌లో ‘నయా వాల్‌’ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విఫలమైన పుజారాపై ఎస్‌ఎస్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి అజింక్య రహానేకు అప్పగించారు. దాంతో పుజారా కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనని ఎందరూ భావిస్తున్నారు. అయితే పుజారా కెరీర్ ఇప్పుడే ముగిసిపోలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ కాంబోను ప్రయత్నించాలని బీసీసీఐ సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ భావించారని.. అందుకే చతేశ్వర్ పుజారాకు వెస్టిండీస్ పర్యటనలో చోటు దక్కలేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ భావించారు. అందుకే వెస్టిండీస్ పర్యటనలో పుజారాకు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని పుజారాతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. పూజికి ఇంకా భారత జట్టుకి ఆడే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తే గతంలో మాదిరి పునరాగమనం చేయవచ్చు’ అని సదరు బీసీసీఐ అధికారి ఓ జాతీయ మీడియాతో చెప్పాడు.

Also Read: Cheteshwar Pujara: భారత జట్టులో దక్కని చోటు.. చెతేశ్వర్‌ పుజారా కీలక నిర్ణయం!

గతంలో కూడా చతేశ్వర్ పుజారా భారత జట్టులో చోటు కోల్పోయాడు. శ్రీలంక పర్యటనకు దూరమైన పుజారా.. కౌంటీ క్రికెట్‌లో సత్తాచాటి మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో సత్తాచాటాడు. ఆపై బంగ్లాదేశ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో దారుణంగా విఫలమై మరోసారి జట్టులో చోటు కోల్పోయాడు. మరి ఈసారి జట్టులోకి వస్తాడో లేదో చూడాలి.

భారత టెస్ట్ జట్టు (India Test Squad):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం!