India Predicted Playing XI vs USA: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్‌ను అమెరికాతో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం (ఫిబ్రవరి 7) రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇటీవల వరుసగా విఫలమవుతున్న సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో భారత్ టీమ్ కాంబినేషన్ ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు బరిలోకి దిగనున్నారు. అభిషేక్ తన ఫామ్ కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇక కివీస్ సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేసిన సంజూకు ఇదే చివరి అవకాశం. అమెరికాపై కూడా ఆడకుంటే.. అతడికి ప్లేయింగ్ 11లో చోటు గల్లంతు కానుంది. తిలక్ వర్మ కోలుకున్నా.. చిన్న టీమ్ కాబట్టి అతడు ఆడడం లేదని సమాచారం. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగులో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. కివీస్ సిరీస్‌లో ఈ ఇద్దరు చెలరేగిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కీలక పాత్ర పోషించనున్నారు. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఆడుతాడు.
బౌలింగ్ విభాగంలో స్పిన్, పేస్ రెండింటికీ సమతుల్యం కలిగిన జట్టును సెలెక్టర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. బ్యాటింగ్ సామర్థ్యం ఉండడం అక్షర్‌కు కలిసొచ్చే అంశం. కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. పేస్ దళానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతడికి అర్షదీప్ సింగ్ సహకారం అందించనున్నాడు. మూడో పేసర్‌గా హార్దిక్ ఉండనే ఉండనున్నాడు. అవసరం అనుకుంటే దూబే కూడా బౌలింగ్ చేస్తాడు. తొలి మ్యాచ్‌తోనే టోర్నీలో మంచి ఆరంభం చేయాలని భారత్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
Also Read: Seetha Payanam: హీరోయిన్‌గా అర్జున్ కూతురు ఎంట్రీ.. ప్రేమికుల రోజు కానుకగా ‘సీతా పయనం’!
భారత జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
