IND vs SL 2nd Test: పంత్, జురెల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ అంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL Day 2 Launch Break: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. ఈ సెషన్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. లంచ్ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్ (63), ధ్రువ్ జురెల్ (59) ఉన్నారు. ఈ ఇద్దరు సెంచరీలు చేస్తే.. టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం.
గాయంతోనూ బ్యాటింగ్ చేస్తున్న రిషభ్ పంత్ తనదైన శైలిలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కేశర నువంత బౌలింగ్‌లో బౌండరీ బాదిన పంత్.. 81 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అతడికి ఇది 21వ అర్ధ సెంచరీ. మరోవైపు ధ్రువ్ జురెల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 97 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున జురెల్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. పంత్, జురెల్ కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. భారత్ 400 పరుగుల మార్క్‌ను దాటింది.
Also Read
- WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
- India's Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
- NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
- SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
రెండో రోజు తొలి సెషన్లో భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. అరంగేట్ర టెస్టు ఆడుతున్న సారంశ్ జైన్‌ను అసిత ఫెర్నాండో 6 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు. లంచ్ సమయానికి రిషభ్ పంత్ 63 పరుగులతో, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి శ్రీలంకపై మరింత ఒత్తిడి పెంచే దిశగా సాగుతోంది. పంత్, జురెల్ భాగస్వామ్యం భారత్‌కు కీలకంగా మారింది. వీరిద్దరూ ఇదే దూకుడును కొనసాగిస్తే టీమిండియా స్కోరు పరుగులు పెట్టనుంది.
తాజావార్తలు
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!