స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమైన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 10) వడోదరలోని బీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ అస్వస్థతకు గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ అకస్మాత్తుగా తన కుడి వైపున ఉదరంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వెంటనే అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. సైడ్ స్ట్రెయిన్ (వక్ర కండరాల చీలిక) ఉందని తేలింది. దాంతో పంత్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి బీసీసీఐ సెలెక్టర్లు తొలగించారు.
రిషబ్ పంత్ స్థానంలో ఐపీఎల్ స్టార్, టీమిండియా కీపర్ ధ్రువ్ జురెల్‌ను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. వన్డే జట్టులో జురెల్ రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉంటాడు. ప్రధాన కీపర్‌గా కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇప్పటికే జురెల్ వడోదరలోని భారత జట్టులో చేరాడు. 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో ఆకట్టుకోవడంతో.. జురెల్ టీమిండియాలోకి వచ్చాడు. 24 ఏళ్ల జురెల్ భారత జట్టు తరపున 9 టెస్టులు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో 35.30 సగటుతో 459 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. టీ20 మ్యాచ్‌లలో 4.00 సగటుతో 12 పరుగులు చేశాడు. జురెల్ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయకపోయినా.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా భారత జట్టులో భాగమయ్యాడు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి, కుల్‌దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).
భారత్ vs న్యూజిలాండ్ వన్డే షెడ్యూల్:
జనవరి 11 – 1వ వన్డే, వడోదర
జనవరి 14 – 2వ వన్డే, రాజ్‌కోట్
జనవరి 18 – 3వ వన్డే, ఇండోర్
