Site icon NTV Telugu

IND vs NZ: ఇషాన్, సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు.. రెండో టీ20లో 209 రన్స్ ఉఫ్!

Ishan Kishan, Suryakumar Yadav

Ishan Kishan, Suryakumar Yadav

న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ సునాయాస విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 28 బంతులు ఉండగానే ఛేదించింది. ఇషాన్ కిషన్‌ (76; 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ (82; 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్డ్ హిట్టర్ శివమ్‌ దూబే (36; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) ధాటిగా ఆడాడు. సంజూ శాంసన్‌ (6), అభిషేక్‌ శర్మ (0) నిరాశపరిచారు.ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. రచిన్ రవీంద్ర (44), మిచెల్ శాంట్నర్ (47 నాటౌట్) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు సీఫర్ట్‌ (24), కాన్వే (19) దూకుడుగా ఆడారు. ఫిలిప్స్‌ (19), మిచెల్‌ (18), చాప్‌మన్‌ (10) నిరాశపరిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ పడగొట్టగా.. హార్దిక్, హర్షిత్, వరుణ్‌, దూబె తలో వికెట్ పడగొట్టారు.

Exit mobile version