Henry Nicholls: మా బ్యాటర్లు తోపు, ఓడిపోయే మ్యాచ్‌ను డ్రా చేశారు.. హెన్రీ నికోల్స్ ఆనందం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Henry Nicholls Hails NZ Batters: భారత్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 175 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన నికోల్స్.. ఐదు రోజుల ఆటను వెనక్కి తిరిగి చూసుకుంటే పిచ్ పరిస్థితులు మారుతూ వచ్చాయని, రెండు జట్లు తమ శక్తిమేరకు పోరాడాయని తెలిపాడు. ముఖ్యంగా చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తమ బ్యాటర్లు చూపిన పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నాడు. డారిల్ మిచెల్ (49: 186 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (26: 126 బంతుల్లో) 43 ఓవర్ల పాటు క్రీజ్‌లో పాతుకుపోవడంతో టీమిండియాకు విజయం దక్కలేదు.
సవాళ్లు ఎదురయ్యాయి:
మ్యాచ్ అనంతరం హెన్రీ నికోల్స్ మాట్లాడుతూ.. ‘తొలి ఇన్నింగ్స్ నుంచి మ్యాచ్ ముగిసే సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిచ్‌లో మార్పులు వచ్చినప్పటికీ బ్యాటర్లకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లోనూ వాటిని అధిగమిస్తూ ఆడటం జట్టుకు సంతృప్తినిచ్చింది. ఒక దశలో కష్టాల్లో ఉన్న జట్టు చివరకు మ్యాచ్‌ను డ్రాగా ముగించుకోవడం సంతోషంగా ఉంది. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతం. ఇద్దరు బాగా ఆడారు. భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఆ ఇద్దరి వల్లే మ్యాచ్‌ను డ్రాగా ముగించుకోగలిగాం. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు’ అని చెప్పాడు.
Also Read
- Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
- Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
- WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
- Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
మరికొంత సేపు ఆడితే బాగుండేది:
టెస్టులో తొలి నాలుగు రోజుల పాటు ఎక్కువ సమయం మైదానంలోనే గడిపిన నికోల్స్‌ను శారీరక పరిస్థితి గురించి ప్రశ్నించగా.. తాను బాగానే ఉన్నానని చెప్పాడు. ‘ఐదు రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం వల్ల ఆటగాళ్లంతా అలసిపోయారు. చివరి రోజు మైదానంలోకి దిగకుండా ఉండటం నాకు కొంత వింతగా అనిపించించింది. శరీరం నొప్పులతో ఉన్నప్పటికీ మరికొంత సేపు మైదానంలో ఉండి ఆడితే బాగుండేది. ఈ మ్యాచ్ నిజంగా ఓపికకు పరీక్షగా నిలిచింది. ఐదు రోజుల ఆట తర్వాత ప్రతి ఒక్కరూ అలసటను అనుభవిస్తారు. బేసిన్ రిజర్వ్ మైదానంలో నాకు మంచి రికార్డు ఉంది. ఈ మైదానంపై నాకు ఎందుకు అంత ప్రత్యేకమైన అనుబంధం ఉందో కచ్చితంగా చెప్పలేను. గతంలో మంచి ప్రదర్శనలు చేసిన మైదానానికి తిరిగి రావడం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. ఈసారి కూడా తొలి రోజు పిచ్ గతంలో మాదిరిగానే ఉంటుందని భావించాము. అయితే ఆట సాగుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. అయినప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటూ జట్టు వాటికి తగిన పరిష్కారాలు కనుగొనడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.
ఉత్కంఠభరిత పోరు:
తదుపరి క్రైస్ట్‌చర్చ్ టెస్టు గురించి మాట్లాడుతూ.. అక్కడ సాధారణంగా పిచ్‌పై కొంత గడ్డి ఉండటంతో పాటు బౌలర్లకు వేగం, బౌన్స్ లభిస్తాయని నికోల్స్ తెలిపాడు. ఈసారి కూడా అలాంటి పిచ్ ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తొలి టెస్టు డ్రాగా ముగియడంతో చివరి మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారిందని, క్రైస్ట్‌చర్చ్‌లో ఉత్కంఠభరిత పోరు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేయగా, భారత్ 720/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 239/5 స్కోరు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నికోల్స్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 175 పరుగులు చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో కీలక 31 పరుగులు సాధించి జట్టు తరఫున కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Henry Nicholls: మా బ్యాటర్లు తోపు, ఓడిపోయే మ్యాచ్‌ను డ్రా చేశారు.. హెన్రీ నికోల్స్ ఆనందం!
-
Stock Market Crash: బ్లాక్ మండే.. స్టాక్ మార్కెట్లో భారీ విధ్వంసం.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
-
Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..