భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభమవుతుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 37 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వన్డే సిరీస్ విజయం అందుకున్న కివీస్.. టీ20 సిరీస్ కూడా కొట్టాలని చూస్తోంది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ పొట్టి సిరీస్ అయినా పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తొలి టీ20కు బరిలోకి దిగే ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
ఈ మ్యాచ్‌లో సంజూ సాంసన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. అంతేకాదు వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ మరో ఓపెనర్‌గా ఆడనున్నాడు. ఈ జోడీ కొంతకాలంగా మంచి ఆరంభాలు ఇస్తున్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలు మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. హార్దిక్ ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో పాటు బంతితో కూడా జట్టుకు కీలకంగా మారనున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్ ఆడనున్నాడు. శివమ్ దూబే, రింకూ సింగ్ ఫినిషర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. చివరి ఓవర్లలో ఈ ఇద్దరి దూకుడు టీమిండియాకు కీలకం కానుంది.
Also Read: Tollywood Heros: టాలీవుడ్ కొత్తతరం హీరోలు.. నటులే కాదు స్టోరీ సృష్టికర్తలు కూడా!
బౌలింగ్ విభాగానికి వస్తే.. పేస్ దళానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతనికి తోడుగా అర్షదీప్ సింగ్ ఆడనున్నాడు. మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా ఆడుతాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. మొత్తంగా యువ, సీనియర్ ఆటగాళ్లతో కలిపి న్యూజిలాండ్‌కు టీమిండియా గట్టి సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్ కూడా బలంగానే ఉంది. రేపటి తొలి టీ20 మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
భారత్ తుది జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
