భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ చర్చకు కారణం బుమ్రా సతీమణి సంజనా గణేశన్. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బుమ్రా, సంజనా మైదానంలో మాట్లాడుకోవడమే నెట్టింట ఈ చర్చకు దారి తీసింది. సాధారణంగా విదేశీ టూర్ల సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ కఠిన నియమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా సిరీస్ మధ్యలో లేదా ఐసీసీ టోర్నమెంట్ల సమయంలో కుటుంబ సభ్యుల ప్రయాణంపై పరిమితులు ఉంటాయి.
అయితే ఈ విషయంలో జస్ప్రీత్ బుమ్రా లక్కీ అనే చెప్పాలి. తన సతీమణి సంజనా గణేశన్‌ను ఎప్పుడంటే అప్పుడు కలుసుకోవచ్చు. మైదానంలో కూడా ఇద్దరు ముచ్చటించుకోవచ్చు. ఎందుకంటే.. సంజనా స్పోర్ట్స్ ప్రెజెంటర్ కావడమే. ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ ఈవెంట్లకు మీడియాలో భాగంగా ప్రయాణించే అవకాశం సంజనాకు ఉంటుంది. భారత్ ఆడే దాదాపు అన్ని మ్యాచ్‌లకు సంజనా ప్రెజెంటర్‌గా ఉంటారు. అందుకే ఇద్దరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే నమీబియా మ్యాచ్ సందర్భంగా బుమ్రా, సంజనా కలిసి మైదానంలో కాసేపు అలా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘బుమ్రా భలే లక్కీ’, ‘ఇతర ఆటగాళ్లకు లేని సౌలభ్యం బుమ్రాకు ఉంది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: Team India History: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్రాత్మక రికార్డు!
ఇక నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాదు మెరుపు ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్లోని మూడో బంతిలి నమీబియా బ్యాటర్ మలన్ క్రుగర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బుమ్రా రన్నింగ్ చేస్తూ.. సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
