Site icon NTV Telugu

IND vs ENG Semi Final 2026: స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటు.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్!

Ind Vs Eng Semi Final 2026

Ind Vs Eng Semi Final 2026

India face a tough spin challenge against England: టీ20 వరల్డ్ కప్ 2026 కీలక అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. గురువారం (మార్చి 5) రెండో సెమీ ఫైనల్ జరగనుండగా.. భారత్, ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కొత్త సవాల్ ఎదురవుతోంది. మెగా టోర్నీ మొత్తం స్పిన్ బౌలింగ్‌లో భారత్ ఇబ్బంది పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు వికెట్లు కోల్పోవడం సూర్య సేనను ఆందోళన కలిగిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో ఆడిన మ్యాచ్‌లో భారత్ 8 ఓవర్లలో 42 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. నమీబియాపై 8 ఓవర్లలో 61 పరుగులకు 5 వికెట్లు నష్టపోయింది. పాకిస్థాన్‌పై 18 ఓవర్లలో 144 పరుగులకు 7 వికెట్లు పడగా.. నెదర్లాండ్స్పై జట్టుపై 8 ఓవర్లలో 70 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై 4 ఓవర్లలో 29 పరుగులకు 4 వికెట్లు, వెస్టిండీస్‌పై 6 ఓవర్లలో 58 పరుగులకు 1 వికెట్, జింబాబ్వేపై 6 ఓవర్లలో 55 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై మినహా మిగతా మ్యాచ్‌లలో భారత బ్యాటర్లు స్పిన్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఈ గణాంకాలు భారత బ్యాటర్ల స్పిన్ బలహీనతను చూపిస్తున్నాయి.

Also Read: Most Wides and No-Balls: టీ20ల్లో అత్యధిక వైడ్లు, నోబాల్స్ లిస్ట్.. టాప్‌లో అర్షదీప్, బుమ్రా ప్లేస్ ఎక్కడుందో తెలుసా?

ముంబైలో సెమీఫైనల్‌లో పటిష్ట ఇంగ్లాండ్‌ను భారత్ ఎదుర్కోవాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు స్పిన్ దళంతో బలంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, జాకబ్ బెథెల్ వంటి ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్ బౌలింగ్‌లో భారత్ తడబాటును ఇంగ్లీష్ టీమ్ యూఏపీయోగించుకోనుంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. భారత్‌కు కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో మధ్య ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం, స్ట్రైక్ రోటేట్ చేయడం ఇప్పుడు సూర్య సేనకు అత్యంత ముఖ్యం. భారత్ బ్యాటర్లు స్పిన్నర్లపై దూకుడుగా ఆడతారా? లేక జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తారా? అన్నది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. సెమీఫైనల్‌లో భారత్‌కు స్పిన్ బౌలింగ్ పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ స్పిన్ పరీక్షను టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Exit mobile version