IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం నుంచి ప్రారంభం కానున్న భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్ (2027) కోసం టీమిండియా బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి ఒక గొప్ప అవకాశమని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. జియోస్టార్ (JioStar) చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను విశ్లేషించారు.
గుర్నూర్ బ్రార్ ఎంపిక వెనుక వ్యూహం..
ఈ సిరీస్ కోసం 6 అడుగుల 5 అంగుళాల పొడవైన పేసర్ గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేయడంపై పఠాన్ స్పందించారు. సౌతాఫ్రికా పిచ్‌లపై లభించే అదనపు పేస్, బౌన్స్‌ను తట్టుకునేలా బౌలర్లను సిద్ధం చేయడమే మేనేజ్మెంట్ లక్ష్యమని చెప్పారు. బ్రార్ తన ఎత్తు వల్ల సహజంగానే పిచ్ నుంచి అదనపు బౌన్స్ రాబట్టగలడని, ఇది ప్రపంచకప్ సన్నాహకాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Also Read
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
- Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
ఇషాన్ కిషన్, ఆల్రౌండర్లపై నమ్మకం..
షార్ట్ పిచ్ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడే ఇషాన్ కిషన్ జట్టుకు కీలకమైన బ్యాకప్ ఆప్షన్ అని పఠాన్ కొనియాడారు. అతనికి స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడే నైపుణ్యం ఉందని.. బ్యాకప్ ఓపనర్‌గా, విరాట్ కోహ్లీ లేనప్పుడు నంబర్ 3 స్థానంలో, అలాగే వికెట్ కీపర్‌గా బహుముఖ పాత్రలు పోషించగలడని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే, సౌతాఫ్రికా కండిషన్స్ కోసం నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లకు వన్డేల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
రోహిత్, విరాట్ లీడర్షిప్..
రోహిత్ శర్మ షార్ట్ పిచ్ బంతులను, పుల్ షాట్లను ఆడే విధానం అమోఘమని, సౌతాఫ్రికా పిచ్‌లపై అతని టైమింగ్ జట్టుకు చాలా కీలకం అవుతుందని పఠాన్ అన్నారు. ఇక వన్డేల్లో విరాట్ కోహ్లీ రికార్డులే అతని ప్రతిభకు నిదర్శనమన్నారు. ఒకవేళ ప్రారంభంలోనే వికెట్లు పడినా, నంబర్ 3లో వచ్చి ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో, ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని పఠాన్ ప్రశంసించారు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 13న ధర్మశాలలో, మిగిలిన రెండు మ్యాచ్‌లు జూన్ 17, 20 తేదీల్లో జరగనున్నాయి.
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!