Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం… ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కష్టసమయంలో జట్టును ఆదుకుంటూ శతకంతో చెలరేగిన ఆయన.. క్రికెట్ ఏ ఫార్మాట్లోనైనా భారత్‌పై సెంచరీ సాధించిన తొలి ఆఫ్ఘన్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత షాహిదీ వన్డే కెరీర్లో సాధించిన మొట్టమొదటి అంతర్జాతీయ శతకం ఇది కావడం విశేషం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గట్టి షాక్ ఇచ్చాడు. కేవలం 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర పరాజయం వైపు వెళ్తున్న తరుణంలో, కెప్టెన్ షాహిదీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. అయితే శతకానికి చేరువవుతున్న సమయంలో ఆయనకు సహచరుల నుంచి మద్దతు కరువైంది. జట్టు స్కోరు 91 వద్ద ఉండగా రషీద్ ఖాన్ అవుట్ కాగా, ఆ వెంటనే మరో ఇద్దరు బ్యాటర్లు రనౌట్ అయ్యారు. అయినప్పటికీ ఎంతో ఓపికతో ఆడిన షాహిదీ.. చివరి వికెట్ బ్యాటర్ జియాతో కలిసి తన చారిత్రాత్మక సెంచరీని పూర్తి చేశాడు.
Also Read
- Shreyas Iyer Record: టాస్‌లలో 'రారాజు' శ్రేయస్ అయ్యర్!
- IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
- Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
చెన్నైలోని విపరీతమైన వేడి, ఉక్కపోత కారణంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో షాహిదీ ‘హ్యామ్‌స్ట్రింగ్’ (కండరాల నొప్పులు) సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. క్రీజులో పరుగెత్తడానికి సైతం నొప్పితో విలవిలలాడినప్పటికీ, పట్టుదల వీడకుండా పోరాడాడు. మొత్తం 131 బంతులు ఎదుర్కొన్న ఆయన.. 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 102 పరుగులు చేసి, చివరికి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. షాహిదీ వీరోచిత పోరాటం వల్లే ఆఫ్ఘనిస్తాన్ జట్టు 44.2 ఓవర్లలో 218 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఈ చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆఫ్ఘన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!