IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..
- 2008లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్..
- అప్పటి నుంచి ఉత్కంఠగా సాగిన కొన్ని మ్యాచ్‌లు..
- IMDb ప్రకారం.. టాప్ 5 ఐపీఎల్ మ్యాచ్‌ల లిస్ట్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL)లో ఎన్నో అద్భుతమైన మ్యాచులు జరిగాయి. ఈ నేపథ్యంలో.. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ IMDb క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన టాప్-5 ఐపీఎల్ మ్యాచుల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవే..
1. 2019 ఫైనల్ (MI vs CSK):
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
- 2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్స్‌లో ఒకటి. ముంబై ఇండియన్స్ కేవలం 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. బౌలర్లు అద్భుతంగా పోరాడారు. ఆఖరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగులు కావాల్సిన సమయంలో లసిత్ మలింగ వికెట్ తీసి ముంబైకి ఒక్క పరుగు తేడాతో నాలుగో టైటిల్‌ను అందించాడు.
2. 2023 లీగ్ మ్యాచ్ (GT vs KKR)..
ఈ మ్యాచ్ కేవలం ఒక్క ఆటగాడి వీరోచిత పోరాటానికి నిదర్శనం. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, కోల్‌కతా ప్లేయర్ రింకూ సింగ్ చివరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతం.
3. 2014 లీగ్ మ్యాచ్ (MI vs RR)..
ప్లే-ఆఫ్స్‌కు చేరాలంటే రాజస్థాన్ రాయల్స్ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని ముంబై 14.3 ఓవర్లలోనే పూర్తి చేయాల్సిన పరిస్థితి. కోరీ అండర్సన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఆ లక్ష్యాన్ని చేరుకుని నెట్ రన్ రేట్ లెక్కల్లో రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించింది.
4. 2017 ఫైనల్ (MI vs RPS)..
ముంబై ఇండియన్స్ కేవలం 129 పరుగులకే పరిమితమైనా, రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌ను అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేసింది. ఆఖరి ఓవర్లో మిచెల్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై మరోసారి ఒక్క పరుగు తేడాతో ఛాంపియన్‌గా నిలిచింది.
5. 2023 ఫైనల్ (CSK vs GT)..
వర్షం కారణంగా అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. రవీంద్ర జడేజా ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి చెన్నైకి ఐదో టైటిల్‌ను అందించాడు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..