NTV Telugu Site icon

ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ట్రోఫీ!

Odi World Cup 2023

Odi World Cup 2023

World Cup 2023 Trophy Tour launched in Spectacular Fashion: వన్డే ప్రపంచకప్‌ 2023కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్‌ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్‌ చేయగా.. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ టోర్నీ కోసం ఐసీసీ, బీసీసీఐ సంయుక్తంగా సరికొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి.

వన్డే ప్రపంచకప్‌ 223 ట్రోఫీ యాత్రను ఐసీసీ సోమవారం ఘనంగా ఆరంభించింది. ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. బిస్పోక్‌ బెలూన్‌తో సాయంతో ట్రోఫీని భూమి నుంచి 1,20,000 అడుగుల ఎత్తులో ఆవిష్కరించింది. అక్కడ ‘స్ట్రాటోస్ఫియర్‌’ను ట్రోఫీ చేరింది. ఆ సమయంలో 4కె కెమెరాతో ట్రోఫీని కొన్ని షాట్స్‌ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. ఇందుకుసంబందించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈరోజు నుంచి జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 టూర్‌లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ప్రపంచకప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా వెళ్లనుంది. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచకప్‌ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్‌ షెడ్యూల్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!